( 9 Sep, 2015) ముఖ్యమైన ఆపరేషన్లు Published By : upscgk.com ఆపరేషన్ పేరు ఆపరేషన్ ఉద్దేశం » రెయిన్ బో ఈస్ట్ 2004 డిసెంబరు 26న వచ్చిన సునామీ బాధితుల సాయం కోసం మనదేశ నౌకాదళం, శ్రీలంక చేపట్టిన కార్యక్రమం. » ఆపరేషన్ పవన్ శ్రీలంలోని భారత శాంతి స్థాపక దళ కార్యక్రమాలు » ఆపరేషన్ రెడ్ డాన్ ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను పట్టుకోడానికి అమెరికా సైన్యం చేపట్టింది. » ఆపరేషన్ ఓవర్ లోడ్ ఫ్రాన్స్ ను నాజీల నుంచి విముక్తం చేయడానికి అమెరికా చేపట్టిన సైనికచర్య. » ఆపరేషన్ ఈగల్ శ్రీలంకలోని తమిళులకు ఆహార పదార్థాలు, వైద్య సదుపాయాలు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి భారత శాంతిస్థాపక దళం చేపట్టిన కార్యక్రమం. » ఆపరేషన్ లీప్ ఫార్వర్డ్ ఎల్.టి.టి.ఇ (లిబరేషన్ ఆఫ్ తమిళ ఈలం) స్థావరాలను ధ్వంసం చేయడానికి శ్రీలంక సైన్యం, వైమానిక, నౌకాదళాలు సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం. » ఆపరేషన్ ఆల్ క్లియర్ భూటాన్ లోని భారత వ్యతిరేక శక్తులైన ఉల్ఫా, కమటాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ల కోసం చేపట్టిన చర్య. » ఆపరేషన్ తొపక్ మన దేశ యువకులకు అక్రమంగా సైనిక శిక్షణ ఇచ్చి మన దేశంలో అలజడులు సృష్టించడానికి పాకిస్థాన్ అధ్యక్షుడు 1988 లో ఏర్పాటు చేసింది. » ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ అల్ ఖైదా ఉగ్రవాద సంస్థను అరికట్టడానికి అమెరికా చేపట్టిన సైనిక చర్య. » ఆపరేషన్ సన్ షైన్ 1995లో ఎల్.టి.టి.ఈ స్థావరమైన జాఫ్నాపై శ్రీలంక సైన్యం చేపట్టిన చర్య. » ఆపరేషన్ చెక్ మేట్ ఎల్.టి.టి.ఈ కి వ్యతిరేకంగా భారత శాంతిదళాలు తీసుకున్న చర్యలు. » ఆపరేషన్ డిజర్ట్ ఫాక్స్ ఇరాక్ పై దాడికి అమెరికా వైమానిక దళం చేపట్టిన చర్య. » ఆపరేషన్ స్యార్ యర్ ఇరాక్ లోని ఉగ్రవాదులను నాశనం చేయడానికి అమెరికా వైమానిక దళం 2006 లో చేపట్టిన దాడులు. » ఆపరేషన్ రెస్టోర్ హోష్ సోమాలియాలో కరవు నివారణ కోసం యూఎన్ వో చేపట్టిన చర్యలు. » ఆపరేషన్ సైలెన్స్ లాల్ మసీదులోని తీవ్ర వాదులను, మత ఛాందసులను నిరోధించడానికి పాకిస్థాన్ సైన్యం చేసిన కార్యక్రమం » ఆపరేషన్ పుష్ బాల్ బంగ్లాదేశ్ నుంచి భారత దేశంలోకి వలస వచ్చిన వారిని వెనక్కి పంపే కార్యక్రమం » ఆపరేషన్ ఖఖరి రివల్యూషనరీ యునైటెడ్ ఫ్రంట్ కు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి చేపట్టిన చర్య ఇది. సియెర్రాలియోన్ లో జరిగింది. 222 మంది భారత సైనికులను విడిపించడానికి ఈ చర్య చేపట్టారు. » ఆపరేషన్ డెవలప్ మెంట్ ఎఫర్ట్ బంగ్లాదేశ్ లోని తుపాను బాధితుల కోసం చేపట్టిన ఆపరేషన్ ఇది. అమెరికా నావికా దళాలు దీన్ని నిర్వహించాయి. » ఆపరేషన్ ఎర్త్ క్వేక్ ఎల్ టీటీఈ తీవ్రవాదులను నాశనం చేయడానికి శ్రీలంక సైన్యం ఈ చర్యను చేపట్టింది. » ఆపరేషన్ జాయింట్ ఎండీవర్ నాటో ఆధ్వర్యంలో శాంతి స్థాపన కోసం బోస్నియాలో జరిగిన కార్యక్రమం. » ఆపరేషన్ అనకొండ తోరాబోరా గుహల్లో దాక్కొని ఉన్న అల్ ఖైదా తీవ్రవాదులను చంపడానికి అమెరికా ఈ ఆపరేషన్ నిర్వహించింది. » ఆపరేషన్ ఒడిస్సీడాన్ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా తదితర దేశాల సైన్యంతో కూడిన అంతర్జాతీయ దళాలు లిబియాపై చేపట్టిన చర్య. » ఆపరేషన్ జరోనిమా అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ను చంపడానికి అమెరికా సైన్యాలు చేపట్టిన కార్యక్రమం. » ఆపరేషన్ ఖంజర్ తాలిబన్ ల ఏరివేతకు అమెరికా సైన్యం, అప్ఘానిస్థాన్ సైన్యం సంయుక్తంగా చేపట్టిన చర్య. జాతీయ స్థాయిలో చేపట్టిన కొన్ని ముఖ్యమైన ఆపరేషన్లు » ఆపరేషన్ విజయ్ 1999 మే 14న కార్గిల్ లో అక్రమంగా చొరబడిన వారిని నిరోధించడానికి భారత సైన్యం చేపట్టిన చర్య. » ఆపరేషన్ టోర్నడో ముంబయిలో తీవ్రవాదుల దాడి జరిగినప్పుడు నారీమన్ హోటల్లో చిక్కుకున్న బందీలను విడిపించడానికి సైన్యం నిర్వహించిన చర్య. » ఆపరేషన్ బ్లూ స్టార్ అమృతసర్ లోని స్వర్ణదేవాలంలో ఉన్న తీవ్రవాదులను చంపడానికి 1984లో భారత సైన్యం చేపట్టిన చర్య ఇది. » ఆపరేషన్ సైక్లోన్ ముంబయి నగరంపై 2009 సంవత్సరం నవంబరు 26న జరిగిన దాడిలో తాజ్ హోటల్ లో దాక్కున ఉగ్రవాదులను నాశనం చేయడానికి నిర్వహించిన కార్యక్రమం. » ఆపరేషన్ కోబ్రా జమ్మూ-కశ్మీర్ లో తీవ్రవాదుల ప్రాబల్య నిరోధానికి చేపట్టిన చర్య. » ఆపరేషన్ పరాక్రమ్ భారత పార్లమెంటుపై 2001లో దాడి జరిగినప్పుడు తలెత్తిన అవాంఛనీయ పరిస్థితులు, ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ సరిహద్దులోకి సైన్యాన్ని తరలించే చర్య. » ఆపరేషన్ గుడ్ విల్ జమ్మూ-కశ్మీర్ లోని ప్రజల విశ్వాసాన్ని సంపాదించడానికి భారత సైన్యం చేపట్టిన కార్యక్రమం. » ఆపరేషన్ సెర్చ్ ప్రత్యేక ఖలిస్థాన్ దేశం కోసం స్వర్ణదేవాలయం కేంద్రంగా పోరాడుతున్న ఖలిస్థాన్ తీవ్రవాదులను నిరోధించడానికి భారత సైన్యం చేసిన చర్య. » ఆపరేషన్ కూంబింగ్ -1 పంజాబ్ లో తీవ్రవాదుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో వారిని నిరోధించడానికి చేపట్టిన చర్య. » ఆపరేషన్ ఉడ్ రోజ్ 1984లో పంజాబ్ లో తీవ్రవాదుల ఏరివేత చర్య » ఆపరేషన్ షాప్ 1984లో స్వర్ణ దేవాలం మినహా మిగతా గురుద్వారాలలో చేపట్టిన చర్య. » ఆపరేషన్ బ్లాక్ థండర్ 1988లో స్వర్ణ దేవాలయం నుంచి తీవ్రవాదుల ఏరివేత. » ఆపరేషన్ రక్షక్ 1, 2 పంజాబ్ లో తీవ్రవాదుల అరాచకాలకు అడ్డుకట్ట వేసి, అక్కడ ప్రశాంత ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన చర్య. » ఆపరేషన్ నైట్ డామినెన్స్ పంజాబ్ లో రాత్రి వేళల్లో గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడం. » ఆపరేషన్ ఫైనల్ ఎసాల్ట్ పంజాబ్ లో ఉగ్రవాద అణచివేత చర్యలు. » ఆపరేషన్ విన్ ఓవర్ పంజాబ్ లో ప్రజల అభిమానాన్ని పొందడానికి సైన్యం చేపట్టిన కార్యక్రమం. » ఆపరేషన్ హంట్ డౌన్ సరిహద్దు భద్రతా దళం, కశ్మీర్ లోని పోలీసులతో కలిసి కశ్మీర్ లోని ఉగ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన ఆపరేషన్. » ఆపరేషన్ టైగర్ జమ్మూ-కశ్మీర్ లో ఉగ్రవాద నిరోధానికి చేపట్టిన చర్య. » ఆపరేషన్ ఫాక్స్ జమ్మూ – కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని అణచి వేయడానికి నిర్వహించిన కార్యక్రమం ఇది. » ఆపరేషన్ విక్రమ్ ఉగ్రవాదుల నిర్మూలనకు, శాంతి స్థాపనకు జమ్మూ-కశ్మీర్ లో నిర్వహించిన సైనిక చర్య. » ఆపరేషన్ క్రాంతి అసోమ్ లో చెలరేగిన తీవ్రవాదులను నిర్మూలించి ప్రజలకు రక్షణ కల్పించడానికి భారత సైన్యం ఈ చర్య చేపట్టింది. » ఆపరేషన్ భజరంగ్ 1980లో అసోమ్ లో ఉల్ఫా తీవ్రవాదుల ఏరివేతకు సైన్యం చేపట్టిన చర్య ఇది. ఇది విఫలమైంది. » ఆపరేషన్ రైనో ఆపరేషన్ భజరంగ్ విఫలం కావడంతో అసోమ్ తీవ్రవాదలను అణచివేయడానికి చేపట్టిన చర్య. » ఆపరేషన్ క్లౌడ్ బరస్ట్ ఇది కూడా అసోమ్ లోని తీవ్రవాదుల నిర్మూలన కోసం చేపట్టిందే. » ఆపరేషన్ బ్లూ ప్రింట్ ఉల్ఫా తీవ్రవాదులు అసోమ్ లో చేస్తున్న కార్యకలాపాలను వెలుగులోకి తీసుకురావడానికి చేపట్టిన చర్య. » ఆపరేషన్ సహయోగ్ అసోంలో ప్రజల అభిమానాన్ని సంపాదించడం కోసం భారత సైన్యం నిర్వహించిన కార్యక్రమం. » ఆపరేషన్ అగ్ని ఉత్తర ప్రదేశ్ లోని తెరాయ్ ప్రాంతంలోని తీవ్రవాదుల ఏరివేతకు చేపట్టిన చర్య. » ఆపరేషన్ సైకో హజ్రత్ మహల్ మసీదులో దాక్కున్న తీవ్రవాదులకు ఆహార పదార్థాలు అందకుండా అడ్డుకుంటూ వారిపై ఒత్తిడి పెంచడానికి చేపట్టిన సైనిక చర్య. » ఆపరేషన్ పోలో 1948లో హైదరాబాద్ సంస్థానం స్వాధీనానికి భారత ప్రభుత్వం చేపట్టిన పోలీసు చర్య. » ఆపరేషన్ లోటస్ బోఫోర్స్ కుంభకోణంలోని రహస్యాలను ఛేదించడానికి చేపట్టిన పోలీసు కార్యక్రమం. » ఆపరేషన్ శాండల్ ఫాక్స్ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను పట్టుకోడానికి చేపట్టిన పోలీసు చర్య ఇది. » ఆపరేషన్ మిడ్ నైట్ సెంట్రల్ రిజర్వ్ పోలీసు, పంజాబ్ పోలీసులు 1987లో స్వర్ణ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన కార్యక్రమం. » ఆపరేషన్ కోకూన్ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను బంధించడానికి తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన చర్య. » ఆపరేషన్ ధన్వంతరి దొంగ మందులను తయారు చేస్తున్న 4 పరిశ్రమలను గుర్తించి వాటిని నాశనం చేయడానికి బిహార్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. » ఆపరేషన్ త్రీ స్టార్ పార్లమెంట్ పై దాడి జరిగిన కేసులో ప్రధాన నిందితుడు అఫ్జల్ గురును ఉరి తీయడానికి చేపట్టిన చర్య. » ఆపరేషన్ ఎక్స్ ముంబయిలో తీవ్రవాదుల దాడి కేసులో పట్టుబడిన అజ్మల్ కసబ్ ను పుణేలోని ఎరవాడ జైల్లో రహస్యంగా ఉరి తీసిన చర్య. ఇతర ముఖ్యమైన ఆపరేషన్లు » ఆపరేషన్ తోడర్ మల్ బిహార్ లో భూ సంస్కరణలను వేగంగా, నిష్పాక్షికంగా నిర్వహించడానికి చేపట్టిన కార్యక్రమం. » ఆపరేషన్ గ్రీన్ గోల్డ్ వెదురు ఉత్పత్తులను పెంచడానికి చేపట్టిన చర్య. » ఆపరేసన్ బ్లూ రెమ్యూషన్ చేపల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం. » ఆపరేషన్ ఫ్లడ్ 1970లో భారత దేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. » ఆపరేషన్ టీ-14 పెరిగిపోతున్న అవినీతికి వ్యతిరేకంగా 1984లో నిర్వహించిన చర్య. » ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ప్రాథమిక విద్యను పరిపుష్టం చేయడానికి చేపట్టిన కార్యక్రమం ఇది. దీని ద్వారా ప్రాథమిక పాఠశాలల్లో కనీస వసతులు కల్పించారు. » ఆపరేషన్ – 100 కార్లకు నల్లటి అద్దాలు ఉపయోగించ కూడదనే నిబంధనలతో హైదరాబాద్ పోలీసులు చేపట్టిన కార్యక్రమం ఇది. » ఆపరేషన్ సేవా తీవ్రవాదం భయంతో జమ్మూ-కశ్మీర్ ను విడిచి వెళ్లిన ప్రజలకు సహాయం చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం. » ఆపరేషన్ గజ 2008లో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు సృష్టించిన అలజడిని నిరోధించడానికి అటవీశాఖ చేపట్టిన చర్య ఇది. » ఆపరేషన్ ఎక్స్ లెన్స్ 1990 ఏసియన్ క్రీడల్లో ఉన్నత ప్రతిభా ప్రదర్శన లక్ష్యంగా భారత క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం. » ఆపరేషన్ దుర్యోధన్ పార్లమెంట్ లో ప్రశ్నలు అడగటానికి పదకొండు మంది ఎంపీలు డబ్బు తీసుకుంటున్న విషయాన్ని ఆజ్ తక్ టీవీ ఛానల్, కోబ్రా పోస్టు న్యూస్ పోర్టల్ సంయుక్తంగా నిర్వహించిన చర్య ఇది. » ఆపరేషన్ చక్రవ్యూహ్ ఎంపీ లాడ్స్ పథకం కింద పనులు చేపట్టేందుకు అక్రమ మార్గాలను ఎంచుకున్న ఎంపీల దురాగతాలను బహిర్గతం చేయడానికి డెడికేటర్ ఇన్వెస్టిగేటివ్ గిల్డ్, స్టార్ న్యూస్ ఉమ్మడిగా చేపట్టిన చర్య.